తప్పుడు వాణిజ్య ప్రకటనలపై ఇక ఉక్కుపాదం.. రూ.50 లక్షల జరిమానా!: వచ్చేస్తున్న కొత్త చట్టం
- మూడేళ్లుగా చట్టానికి రూపకల్పన
- ఈ శీతాకాల సమావేశాల్లో కేబినెట్ ముందుకు
- తప్పుడు ప్రకటనదారులకు ఇక జైలే
సెలబ్రిటీలతో ప్రకటనల్లో నటింపజేసి వినియోగదారులను తప్పుదోవ పట్టించే సంస్థలపై రూ.50 లక్షల జరిమానాతోపాటు వాటిపై మూడేళ్ల నిషేధం విధించనున్నారు. అంతేకాదు జైలు శిక్ష కూడా విధించనున్నారు.
అంతర్జాతీయ కన్జూమర్ ప్రొటెక్షన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మూడేళ్లుగా రూపకల్పన చేస్తున్న ఈ చట్టాన్ని శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. వినియోగదారుల సాధికారతకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మోసపోయిన వినియోగదారులకు త్వరితగతిన పరిహారం అందించేందుకు ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వినియోదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు.