సుబ్రహ్మణ్యస్వామికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు... పిటిషన్ కొట్టివేత
- సమాచారాన్ని స్వామి రహస్యంగా ఉంచారన్న కోర్టు
- స్వామి పిటిషన్ కొట్టివేత
- స్వామి ఆరోపణలను ఖండించిన ఢిల్లీ పోలీసులు
సునంద మృతి కేసును సీబీఐ ప్రత్యేక బృందం చేత దర్యాప్తు జరిపించాలని... ఈ దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో జులై మొదటి వారంలో స్వామి పిల్ దాఖలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను మరో అప్లికేషన్ ను కోర్టులో దాఖలు చేశారు. చార్జ్ షీట్ కు సంబంధించిన కాపీ ఇప్పించాలని ఈ సందర్బంగా ఆయన కోర్టును కోరారు. సాక్ష్యాలను సేకరించడంలో వైఫల్యం, ఎయిమ్స్ కు సహరించకపోవడం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి ఆరోపణలను ఈ పిటిషన్ ద్వారా ఢిల్లీ పోలీసులపై గుప్పించారు స్వామి. ఈ నేపథ్యంలో, చివరకు స్వామి పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.