mexico: 43 వేల సార్లు అత్యాచారానికి గురైన అబల... నేడు న్యాయవాదిగా అభాగ్యులకు అండ!

  • మెక్సికోకు చెందిన కార్లా జాసింటో
  • 12 ఏళ్ల వయసులో మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లోకి
  • ఆపై దీనమైన పరిస్థితుల మధ్య నాలుగేళ్లు
  • పోలీసుల దాడులతో తిరిగి జనజీవనంలోకి

మెక్సికోకు చెందిన కార్లా జాసింటో పేరు గుర్తుందా? గత సంవత్సరం అంతర్జాతీయ మీడియా ముందుకు వచ్చి తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత హేయమైన ఘటనల గురించి పూసగుచ్చినట్టు చెప్పిన యువతి. 12 ఏళ్ల వయసులో ఫాస్ట్ కార్లు, డబ్బు మీద మోజుతో తాను వేసిన తప్పటడుగు తనను ఎక్కడికి తీసుకెళ్లిందో, ఎంత హీన స్థితిలోకి నెట్టేసిందో ఆమె ఇంటర్వ్యూలు ఇస్తుంటే, యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

 తనను కలిసిన ఓ వ్యక్తితో పాటు బయటకు వెళ్లి, మానవ అక్రమ రవాణా ముఠా చేతికి చిక్కి, బలవంతంగా వేశ్యగా మార్చబడి, రోజుకు 30 మంది వరకూ విటులను భరిస్తూ, నాలుగేళ్ల పాటు నరకయాతనలను అనుభవించానని, ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా రాని పరిస్థితిని అనుభవించానని ఆమె చెబుతుంటే, ప్రపంచం కన్నీరు కార్చింది. ఉదయం 10 గంటల నుంచి అర్థరాత్రి వరకూ తనపై మృగాళ్లు పడుతుంటే, బాధను తట్టుకోలేక ఏడుస్తూ, కళ్లు మూసుకుని ఉండిపోవడం మినహా మరేమీ చేయలేని  నిస్సహాయ స్థితి నుంచి బయటపడిన కార్లా ఇప్పుడు ఓ మంచి న్యాయవాది.

2006లో పోలీసులు జరిపిన రైడింగ్ లో అదృష్టవశాత్తూ వారికి దొరికి, ఆ మురికి కూపం నుంచి బయట పడిన ఆమె, న్యాయవాద వృత్తిని ఎంచుకుని, విజయం సాధించింది. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టులకు వచ్చే కేసులను వాదిస్తూ తనవంటి అభాగ్యులకు అండగా నిలుస్తోంది.

More Telugu News