టీడీపీకి బై.. బీజేపీకి జై కొట్టనున్న సినీ నటి కవిత!
- బీజేపీలో చేరుతున్న కవిత
- పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో భేటీ
- మహానాడులో అవమానించారనే బాధలో కవిత
పార్టీకి ఎంతో సేవ చేస్తున్న తనను మహానాడులో అగౌరవపరిచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత పార్టీతో ఆమె అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో ఆమె నిన్న భేటీ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మణే తెలిపారు. కవిత తనను కలిశారని, బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేది బీజేపీనే అని ఆమె నమ్ముతున్నారని చెప్పారు.