దివాలీ సీజన్‌లో నలభై ల‌క్ష‌ల‌కు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్మిన షియోమి

  • వెల్ల‌డించిన షియోమి ఇండియా
  • ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వెబ్‌సైట్ల ద్వారా భారీ అమ్మకాలు
  • ఫేస్‌బుక్‌లో వెల్ల‌డించిన షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్‌
దీపావ‌ళి పండ‌గ సీజ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా నాలుగు మిలియ‌న్ల‌కు పైగా షియోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయ‌ని కంపెనీ వెల్ల‌డించింది. ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గ‌జాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ అమ్మకాల్లో షియోమి బ్రాండ్ నెం. 1గా నిలిచింద‌ని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్ట‌ర్ మ‌ను కుమార్ జైన్ వెల్ల‌డించారు. దీనికి సంబంధించి ఆయ‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

`దివాలీ సేల్స్ పీరియ‌డ్ (సెప్టెంబ‌ర్ 20 - అక్టోబ‌ర్ 19)లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌ల‌తో పాటు ఇత‌ర స్టోర్ల‌ ద్వారా నాలుగు మిలియ‌న్ల షియోమి ఫోన్లు అమ్ముడ‌య్యాయి. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాదే. ఇందుకోసం ఎమ్ఐ అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అలాగే ఎమ్ఐ.కామ్ ద్వారా కూడా ఒక మిలియ‌న్‌కి పైగా యాక్సెస‌రీస్ అమ్ముడ‌య్యాయి. ఈ పోస్ట్‌ను షేర్ చేయండి... ఎమ్ఐ ఏ1 ఫోన్ గెలుచుకోండి` అని జైన్ పోస్ట్ చేశారు.
Go Back to Shorts
xiaomi
redmi
flipkart
amazon
big billion sales
great india sale
diwali
manu kumar jain

More Telugu News