ram: లావణ్య త్రిపాఠి ఇష్టమా? అనుపమ పరమేశ్వరన్ ఇష్టమా? అని అడిగితే... ఐ 'లవ్' 'ఉప్మా' అంటూ చమత్కరిస్తున్న రామ్!

  • రేపు విడుదల కానున్న 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా
  • అభిమానులతో ముచ్చటించిన రామ్
  • లావణ్య ను లవ్ అని, అనుపమను ఉప్మా అని పిలుస్తా
'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో నటుడు రామ్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతున్నాడు.

 ‘‘ఈ సినిమా స్టోరీ చాలా ఫ్రెష్‌ స్టోరీ... ఈ సినిమా చూసిన తరువాత ఎవరి ఫ్రెండ్షిప్‌ కి వాళ్లే సరైన నిర్వచనం ఇచ్చుకోగలరు. దీనితో చాలా మంది తమ ఫ్రెండ్షిప్‌ని పోల్చి చూసుకుంటారని నమ్ముతున్నా’’నని రామ్ చెప్పాడు. సినిమా సెట్ లో అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ లావణ్యను 'లవ్‌' అని పిలిచేవాడిని.

అలాగే అనుపమను 'ఉప్మా' అని పిలిచేవాడిని. వారిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం? అని అడిగితే మాత్రం... ఐ ‘లవ్‌’ ‘ఉప్మా’ అని చెబుతాన’ని రామ్ చమత్కారం. తాను సాధారణంగా రాత్రి తొమ్మిది గంటల తరువాత ఎవరికీ ఫోన్‌ చేయనని చెప్పాడు. అలాంటి తాను ఈ సినిమాలోని పాటలు విని రాత్రి వేళ రచయితలకు ఫోన్‌ చేసి తన భావాలు వివరించానని అన్నాడు.
ram
unnadi okate zindagi
movie

More Telugu News