lakshmi parvati: తనను రచ్చకెక్కిస్తున్నారంటూ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కన్నీరు పెట్టుకున్న లక్ష్మీపార్వతి!

  • నా మనసు బాధపడుతోంది
  • ఉపశమనం కోసం వచ్చాను
  • నన్ను ఇబ్బంది పెట్టినా భరిస్తా
  • నా భర్త పరువు తీస్తే ఊరుకోబోను
  • లక్ష్మీ పార్వతి హెచ్చరిక
తన పరువు తీయాలని చూస్తూ కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వారిని చూసి తన మనసు బాధపడుతోందని చెబుతూ దివంగత సీఎం ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌనదీక్షకు దిగారు. అంతకుముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనను రచ్చకీడ్చాలని భావిస్తున్న కొందరు, ఉన్నవి లేనివి కల్పించి సినిమాలు తీద్దామని భావిస్తున్నారని, వారి ప్రయత్నాన్ని తన ప్రాణం అడ్డుపెట్టయినా అడ్డుకుంటానని అన్నారు.

రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు తన మనసును కలచివేస్తున్నాయని కన్నీరు పెట్టుకున్న లక్ష్మీ పార్వతి, ఉపశమనం కోసం తన భర్త వద్దకు వచ్చానని అన్నారు. తనను ఇబ్బంది పెట్టినా భరిస్తానని, తన భర్త పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లితే మాత్రం చూస్తూ ఊరుకోబోనని అన్నారు. కేతిరెడ్డి సినిమాకు తన అనుమతి తప్పనిసరని, అనుమతి లేకుండా తీసే చిత్రం చెల్లబోదని స్పష్టం చేశారు.
lakshmi parvati
ketireddy
veeragrandham

More Telugu News