killi kruparani: కిల్లి కృపారాణి భర్త, కుమారుడిపై కేసు నమోదు!

  • ఫ్లాట్ కబ్జా చేశారంటూ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు
  • అక్రమ చొరబాటు, బెదిరింపు సెక్షన్ల కింద కేసు
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె భర్త డాక్టర్ రామ్మోహన్ రావు, కుమారుడు విక్రాంత్ లపై విశాఖపట్టణం మహారాణిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సి.డాల్ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కబ్జా చేశారంటూ అపార్ట్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరిపై అక్రమ చొరబాటు, బెదిరింపు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అంశంపై కిల్లి కృపారాణి ఇంకా స్పందించాల్సి ఉంది. 
killi kruparani
congress
case on killi kruparani husband

More Telugu News