telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. వ్యూహాలపై ఆయా పార్టీల భేటీలు!

  • రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
  • అసెంబ్లీ సమావేశాల్లో ముందుకెళ్లాల్సిన అంశాలపై చర్చల్లో తలమునకలైన పార్టీలు
  • పోటాపోటీ సమావేశాలతో పెరుగుతున్న హీట్

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, తాము అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీసీఎల్పీ సమావేశం నిర్వహిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.

అలాగే అధికార పార్టీ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడంపై చర్చించనున్నారు. విపక్ష పార్టీలైన టీడీపీ-బీజేపీలు గోల్కొండ హోటల్ లో సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

More Telugu News