hardhik patel: అరెస్ట్ ఎందుకు? నేనే లొంగిపోతా... ఏం చేస్తారో చేసుకోండి: హార్దిక్ పటేల్

  • కోర్టు విచారణకు వెళ్లని హార్దిక్
  • నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
  • జైల్లో ఉంచినా ఉద్యమం ఆగదు
  • బీజేపీ కక్షసాధింపు ధోరణేనన్న హార్దిక్

పోలీసులు తనను అరెస్ట్ చేయాలని భావిస్తే, ఆ అవసరం రానీయబోనని, లొంగిపోయేందుకు తాను సిద్ధమని పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా కోర్టు విచారణను ఎదుర్కొంటున్న హార్దిక్, ఇటీవలి కాలంలో వాయిదాలకు వెళ్లకపోవడంతో, కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. బుధవారం నాడు విచారణకు వెళ్లాల్సిన ఆయన గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది.

ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న హార్దిక్, పోలీసులు అరెస్ట్ చేయాలని భావిస్తే, తానే లొంగిపోతానని, తనను జైల్లో ఉంచినా, పటీదార్ల ఉద్యమం ఆగదని తెలిపాడు. 2015లో పటీదార్ ఉద్యమం సాగినప్పుడు మహేసనా ప్రాంతంలో జరిగిన విధ్వంసానికి కారకుడని హార్దిక్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మహేసనా జిల్లాలోకి హార్దిక్ ప్రవేశాన్ని నిషేధించారు. తనపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తాజాగా హార్దిక్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను లొంగిపోతానని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని, పోలీసులు బీజేపీ చెప్పినట్టు చేస్తున్నారని హార్దిక్ విమర్శించారు.

More Telugu News