nithin: అనిల్ రావిపూడి కథ తెగ నచ్చేసిందట .. నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు

  • 'లై' మూవీ రిజల్ట్ తో డీలాపడిన నితిన్ 
  • కృష్ణచైతన్య దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం
  • ఇటీవలే ఆయనకి కథ వినిపించిన అనిల్ రావిపూడి 
  • త్వరలో సెట్స్ పైకి      

'లై' సినిమా భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందని నితిన్ బలంగా నమ్మాడు. అయితే, ఈ విషయంలో ఆయనకి పూర్తి నిరాశే ఎదురైంది. ఈ సినిమా కోసం పడిన శ్రమంతా వృథా కావడంతో ఆయన డీలాపడిపోయాడు. అప్పటికే ఆయన పవన్ బ్యానర్లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకుని వున్నాడు. ప్రస్తుతం ఆయన అదే సినిమా చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనకి దర్శకుడు అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. ఈ కథ నితిన్ కే కాదు .. ఆయన తండ్రికి కూడా బాగా నచ్చేసిందట. దాంతో తమ సొంత బ్యానర్లో ఈ సినిమా చేయడానికి వాళ్లు ఆసక్తిని చూపారని సమాచారం. 'రాజా ది గ్రేట్' తో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడి, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ చేస్తోన్న మూవీ పూర్తి కాగానే, ఆయనతో కలిసి సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు. 

More Telugu News