గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో గెలుపెవరిదో తేల్చి చెప్పిన ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే
- మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై గుజరాతీల అసంతృప్తి
- అయినా బీజేపీకే పట్టం
- రాష్ట్రానికి మోదీ సాయం చేస్తున్నారనే భావనలో గుజరాతీలు
గుజరాత్ లో బీజేపీకి 48 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 38 శాతం ఓట్లు పడతాయని సర్వేలో తేలింది. తమ రాష్ట్రానికి మోదీ అన్ని రకాలుగా సాయం చేస్తున్నారంటూ 66 శాతం మంది గుజరాతీలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో జీఎస్టీపై 51 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. 53 శాతం మంది పెద్ద నోట్ల రద్దును తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలు బాగోలేవని 66 శాతం మంది గుజరాతీలు అభిప్రాయపడ్డారు.