మారనున్న ఎయిర్ లైన్ రూల్స్... ఇకపై చెకిన్ బ్యాగేజీలో ల్యాప్ టాప్ లపైనా నిషేధం
- ఇప్పటికే పవర్ బ్యాంకులపై నిషేధం
- మొబైల్ చార్జర్లు, ఈ సిగరెట్లపై కూడా
- పేలితే కనుక్కోవడం కష్టం
- క్యాబిన్ బ్యాగేజీలో మోసుకెళ్లాల్సిందే
ఇదే విధమైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ సంస్థలు భావించినట్టు తెలుస్తోంది. ల్యాప్ టాప్ వంటి వస్తువులు ప్రమాదవశాత్తూ పేలితే దాన్ని కనుక్కోవడం కష్టమన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం అమలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులైనా క్యాబిన్ లగేజీతో పాటు మోసుకు వెళ్లాలే తప్ప చెకిన్ చేసేందుకు వీలుండదు.