కోహ్లీతో పెళ్లి వార్తలపై స్పందించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ

  • ఆ వార్తల్లో నిజం లేదన్న అనుష్క
  • పెళ్లికి ఇంకా టైముందన్న బాలీవుడ్ బ్యూటీ
  • కోహ్లీ విశ్రాంతిపై స్పందించిన సెలక్టర్ ఎమ్మెస్కే
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అవార్డు విన్నింగ్ నటి అనుష్క శర్మలు ఈ డిసెంబరులో పెళ్లాడబోతున్నారంటూ వస్తున్న వార్తలపై అనుష్క స్పందించింది. ఈ వార్తల్లో లేశమాత్రమైనా నిజం లేదని, అవన్నీ వదంతులు మాత్రమేనని తేల్చి చెప్పింది. పెళ్లికి ఇంకొంత సమయం ఆగాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

వ్యక్తిగత కారణాల వల్ల డిసెంబరులో జరగనున్న సిరీస్ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని, తనకు విశ్రాంతి కావాలని బీసీసీఐని కోహ్లీ కోరడంతో ఈ వార్తలు వెలువడ్డాయి. అనుష్కతో పెళ్లి కోసమే అతడు విశ్రాంతి అడిగి ఉంటాడని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. కోహ్లీ-అనుష్క మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని అటు బాలీవుడ్‌లోనూ, ఇటు క్రికెట్‌లోనూ వార్తలు హల్‌చల్ చేశాయి.

మరోవైపు టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. కోహ్లీ విశ్రాంతి వార్తలను కూడా ఖండించారు. డిసెంబరులో జరగనున్న శ్రీలంక సిరీస్‌లో కోహ్లీ ఆడతాడని పేర్కొన్నారు. అయితే రొటేషన్ పద్ధతిని అవలంబిస్తామని తెలిపారు.  

Go Back to Shorts
Anushka Sharma
Virat Kohli
marriage

More Telugu News