download speed: 7.5 జీబీ ఉన్న సినిమా ఏ దేశంలో ఎంతసేపట్లో డౌన్ లోడ్ అవుతుందంటే..!

  • సింగపూర్ లో 18 నిమిషాలా 34 సెకన్లలో డౌన్ లోడ్
  • తరువాతి స్థానాల్లో స్వీడన్, తైవాన్
  • ఇండియాలో అయితే 8 గంటలకుపైగానే సమయం
  • ర్యాంకుల్లో 119వ స్థానంలో ఇండియా

ఒక సినిమాను ఎంత సేపట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు... స్మార్ట్ ఫోన్ లో 'విడ్ మేట్' యాప్ ఓపెన్ చేసి 300 ఎంబీ లేదా 400 ఎంబీ ఉన్న సినిమాను ఓ అరగంటలో మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారా? అలా కాదు. కనీసం 5 గిగాబైట్ల పైనే ఉండే ఓ హై డెఫినిషన్ మూవీ గురించి... యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన 'కేబుల్ డాట్ కో డాట్ యూకే' వివిధ దేశాల్లో ఇంటర్నెట్ వేగంపై పరీక్షలు నిర్వహించింది.

వీరి రిపోర్టు ప్రకారం, వేగంగా మొబైల్ నెట్ వర్క్ పనిచేసే దేశాల్లో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్ లో సెకనుకు 55.1 మెగాబైట్ల డేటా బట్వాడా అవుతుంది. తరువాతి స్థానాల్లో స్వీడన్ 40.2 ఎంబీపీఎస్, తైవాన్ 34.4 ఎంబీపీఎస్, డెన్మార్క్ 33.5 ఎంబీపీఎస్, నెదర్లాండ్స్ 33.5 ఎంబీపీఎస్ ఉండగా, భారత్ 119వ స్థానంలో 2.1 ఎంబీపీఎస్ కే పరిమితమై ఉంది.

ఇక 7.5 గిగాబైట్ల హై డెఫినిషన్ సినిమాను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఏ దేశంలో ఎంత సమయం పడుతుందన్న పరీక్షను 'కేబుల్ డాట్ కో డాట్ యూకే' నిర్వహించగా, సింగపూర్ లో 18 నిమిషాలా 34 సెకన్లలో డౌన్ లోడ్ పూర్తయింది. స్వీడన్, తైవాన్ దేశాల్లో 30 నిమిషాల్లోపే సినిమా డౌన్ లోడ్ అయింది. ఇక ఇండియా విషయానికి వస్తే 8 గంటలా 16 నిమిషాలు పట్టిందట. ఈ విషయాన్ని 'కేబుల్ డాట్ కో డాట్ యూకే' వెల్లడించింది.

More Telugu News