కనీస ఇంటర్నెట్ వేగాన్ని నాలుగు రెట్లు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం!
- ప్రస్తుత కనీస ఇంటర్నెట్ వేగం సెకనుకు 512 కిలోబైట్లే
- దాన్ని 2 మెగాబైట్లకు పెంచనున్న కేంద్ర ప్రభుత్వం
- త్వరలోనే అధికారిక ఉత్తర్వులు
- వెల్లడించిన టెలికం కార్యదర్శి అరుణా సుందరరాజన్
3జీ, 4జీ తరాలు పోయి 5జీ తరం రానుందని, ఈ నేపథ్యంలో కనీస వేగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మౌలిక వసతుల కొరత దృష్ట్యా 2 ఎంబీపీఎస్ వరకూ మాత్రమే వేగం పెంచలగమని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకానమీగా మారుతోందని, దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ తప్పనిసరిని ఆయన అన్నారు. వైర్ లెన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ పై కన్సల్టేషన్ పేపర్ ను ఇటీవల ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించిన తరువాత తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.