alpesh: గుజరాత్ లో బీజేపీకి మరో దెబ్బ... కాంగ్రెస్ లో చేరిన ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్

  • రాహుల్ సమక్షంలో పార్టీ మారిన అల్పేష్
  • ప్రజాభిమానం కాంగ్రెస్ వైపే ఉంది
  • ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్
  • తేలికగా తీసిపారేసిన బీజేపీ

ఇటీవలి కాలంలో గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీని ఎదిరించి వార్తల్లో నిలిచిన యువ నేతల్లో ఒకరైన ఇతర వెనుకబడిన వర్గాల ప్రతినిధి అల్పేష్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీలో చేరారు. హార్దిక్ పటేల్, జగ్నేష్ మెవాని వంటి వారితో పాటు ఓబీసీ వర్గాల్లో యువత ప్రతినిధిగా పేరు తెచ్చుకున్న అల్పేష్, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ పార్టీలో చేరాలన్న విషయమై తాను ప్రజాభిప్రాయాన్ని సేకరించానని, అత్యధికులు కాంగ్రెస్ వెంట నడవాలని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చి, మార్పు తీసుకురావాలని పలువురు తనను కోరారని, మొత్తం 25 లక్షల మంది అభిప్రాయాన్ని స్వీకరించి తాను కాంగ్రెస్ లో చేరానని అన్నారు. కేవలం లక్షా ఆరు వేల మంది మాత్రమే తనను బీజేపీలో చేరాలని చెప్పారని అన్నారు. కాగా, అల్పేష్ కాంగ్రెస్ లో చేరికపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందిస్తూ, ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చిందని, అల్పేష్ కాంగ్రెస్ మాజీ నేతేనని, ఆ పార్టీ వాళ్లు, ఆ పార్టీలో చేరినట్టు చెప్పుకోవడం ఎందుకని ఎద్దేవా చేశారు. గతంలో అల్పేష్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు.

More Telugu News