Infighting: తాలిబన్ల మధ్య యుద్ధం.. 50 మంది ఉగ్రవాదుల హతం!

  • తాలిబన్లలోని రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు
  • ఆఫ్ఘనిస్థాన్‌లోని షిండాడ్ జిల్లాలో ఘటన
  • ధ్రువీకరించిన ప్రభుత్వ వర్గాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల మధ్య చెలరేగిన ఘర్షణలో 50 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది. తాలిబన్ సుప్రీం ముల్లా హెబతుల్లా అఖుంద్‌జద, అసమ్మతి తాలిబన్ నేత ముల్లా మొహమ్మద్ రసూల్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. షిండాండ్ జిల్లాలోని ఖైఫాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు ప్రావిన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి జిలానీ ఫర్హాద్ తెలిపారు.

కాగా, ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇటువంటివి పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. తాలిబన్ గ్రూప్ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ అయిన ముల్లా మొహమ్మద్ ఒమర్ మృతి తర్వాత తాలిబన్ అసంతృప్త నేత అయిన ముల్లా రసూలు సొంత సైన్యాన్ని నడుపుతున్నాడు. మార్చి 2016లో ముల్లా సమద్, ముల్లా నంగియలై వర్గాల మధ్య జరిగిన అంతర్గత సంఘర్షణల్లో 26 మంది తాలిబన్లు మృతి చెందారు.

More Telugu News