Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • చాలా రోజుల తర్వాత చీర కట్టానంటున్న అందాల రష్మి  
  • 'సామి' సీక్వెల్ నుంచి త్రిష ఔట్
  • నిజ జీవిత పాత్రల్లో వెంకీ, చైతన్య 
  • 'లవర్' సరసన మలయాళ బ్యూటీ  

*  త్వరలో రానున్న 'నెక్స్ట్ నువ్వే' సినిమాలో చీరకట్టులో కనిపిస్తానని చెబుతోంది అందాలభామ రష్మి గౌతమ్. "ఈమధ్య కాలంలో ఆయా పాత్రలను బట్టి సినిమాలలో మోడరన్ దుస్తులే వేశాను. అయితే, నెక్స్ట్ నువ్వే చిత్రంలో మాత్రం నిండుగా చీరకట్టాను" అని చెప్పింది. అయితే, చీరకట్టినా ఇది కూడా గ్లామర్ ప్రధానమైన పాత్రే అని చెప్పింది.
*  విక్రం హీరోగా హరి దర్శకత్వంలో రూపొందే 'సామి' సీక్వెల్ నుంచి కథానాయిక త్రిష తప్పుకుంది. ఈ విషయాన్ని తనే ప్రకటించింది. క్రియేటివిటీకి సంబంధించిన విభేదాల కారణంగా ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఈ ముద్దుగుమ్మ పేర్కొంది. ఇందులో మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.
*  నిజ జీవితంలో మామ, మేనల్లుళ్లయిన వెంకటేశ్, నాగ చైతన్య ఇప్పుడు వెండితెర మీద కూడా అవే పాత్రలు పోషించనున్నారు. 'సోగ్గాడే చిన్ని నాయన' ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ ఈ పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ఫేమిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని దర్శకుడు చెప్పారు.
*  యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన మలయాళ బ్యూటీ గాయత్రి సురేష్ జత కట్టనుంది. 'అలా ఎలా' ఫేం అనీష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'లవర్' చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారు.

More Telugu News