parking: పార్కింగ్ స్థ‌లం బుక్ చేసుకోవ‌డానికి ఓ యాప్‌... మెట్రో న‌గ‌రాల్లో న‌యా ట్రెండ్‌

  • ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ప్ర‌యోగాత్మ‌క విజ‌యం
  • త్వ‌ర‌లో హైద‌రాబాద్‌, పూణె, అహ్మదాబాద్ న‌గ‌రాల‌కు
  • మాల్స్, ఆసుప‌త్రులు, సినిమా థియేట‌ర్ల‌తో ఒప్పందం

క్యాబ్ బుకింగ్‌, సినిమా టిక్కెట్ల బుకింగ్‌ల త‌ర్వాత ఇప్పుడు పార్కింగ్ స్థ‌లాల బుకింగ్ వంతు వ‌చ్చింది. అవును... త్వ‌ర‌లో పార్కింగ్ స్థలాల‌ను కూడా స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. పార్కింగ్ వ్య‌వ‌హారాలు చూసుకునే సంస్థ‌లు ఈ యాప్ ద్వారా పార్కింగ్ స్థ‌లాల‌ను బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించనున్నాయి. ఇప్ప‌టికే ముంబై, ఢిల్లీ, బెంగ‌ళూరులో ఈ యాప్ సేవ‌లు ప్ర‌యోగాత్మ‌కంగా విజ‌యం సాధించాయి. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌, పూణె, అహ్మదాబాద్ న‌గ‌రాల‌కు ఈ సేవ‌ల‌ను విస్త‌రించ‌నున్నారు.

ఫోర్ వీల‌ర్స్‌తో పాటు టూ వీల‌ర్స్‌కి కూడా పార్కింగ్ స్థ‌లాన్ని బుక్ చేసుకునే అవ‌కాశం ఈ యాప్ ద్వారా వుంది. రాజ‌ధాని ఢిల్లీలో త‌మ యాప్‌ను రోజుకి 60 వేల మంది ఉప‌యోగిస్తార‌ని `గెట్ మై పార్కింగ్‌` యాప్ స్థాప‌కుడు రాసిక్ పాన్స‌రే తెలిపారు. అలాగే పార్క్‌జీబ్రా, పార్క్‌వీల్స్ యాప్‌లు కూడా బాగానే వెన‌కేసుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే ఈ స్మార్ట్ పార్కింగ్ స‌దుపాయాన్ని దేశ‌వ్యాప్తం చేయ‌డానికి ఈ కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష‌న్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాల‌జీతో ప‌నిచేసే ఈ యాప్ సంస్థ‌లు న‌గ‌రంలోని షాపింగ్‌ మాల్స్‌, ఆసుప‌త్రులు, సినిమా థియేటర్ల‌తో ఒప్పందం కుదుర్చుకుంటాయి.

More Telugu News