బాలీవుడ్ నటుడికి గ్యాంగ్ స్టర్ బెదరింపులు!
- ఫోన్ చేసి బెదిరిస్తున్న గ్యాంగ్ స్టర్ మున్నా పూజారి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు ఆదిత్య పంచోలీ
- రూ. 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్
అక్టోబర్ 18 నుంచి మున్నా పూజారి అనే వ్యక్తి తనను బెదిరిస్తూ మెసేజ్ లు పెడుతున్నాడని ఆదిత్య ఆరోపించాడు. డబ్బు ట్రాన్స్ ఫర్ చేసేందుకు ఓ బ్యాంకు ఖాతా నెంబరును కూడా ఇచ్చాడని పోలీసులకు చెప్పాడు. ఆ ఖాతా సంఖ్య ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.