dalailama: దలైలామాను కలవవద్దు.. తీవ్ర నేరంగా పరిగణిస్తాం: విదేశీ నేతలను హెచ్చరించిన చైనా

  • దలైలామాను ఎవరూ కలిసే ప్రయత్నం చేయవద్దు
  • మేము తీవ్ర నేరంగా భావిస్తాం
  • తమతో సంబంధం ఉన్న నేతలను హెచ్చరించిన చైనా

బౌద్ధ మత ఆధ్యాత్మిక గురువు దలైలామాను విదేశీ నేతలు ఎవరు కలిసినా తీవ్ర నేరంగానే పరిగణిస్తామంటూ చైనా హెచ్చరికలు జారీ చేసింది. దలైలామాకు ఎవరు ఆశ్రయం కల్పించినా, ఎవరు కలిసినా సహించబోమని వార్నింగ్ ఇచ్చింది. ఆయనను వ్యక్తిగతంగా కలవాలని విదేశీ నేతలు భావిస్తుండవచ్చని... అయితే, తమతో సంబంధాలు ఉన్న నేతలు మాత్రం అలా చేయవద్దని సూచించింది.

చైనా పాలనకు వ్యతిరేకంగా 1959లో దలైలామా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన భారత్ లో ప్రవాసం ఉంటున్నారు. ఆయనను ప్రమాదకరమైన వేర్పాటువాదిగా చైనా చూస్తోంది. మరోవైపు, తమ మాతృభూమి టిబెట్ కు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని దలైలామా డిమాండ్ చేస్తున్నారు. 

More Telugu News