neelakanta: రెండే పాత్రలతో 'షో' మూవీ చేయడానికి గల కారణమదే!: దర్శకుడు నీలకంఠ

  • వైవిధ్యభరితమైన కథా చిత్రాల దర్శకుడిగా నీలకంఠ
  • ఆయన తెరకెక్కించిన 'షో' ఓ ప్రయోగం
  • 'షో' కథ అలా పుట్టింది 
  • మంచి పేరు తెచ్చిపెట్టిన 'మిస్సమ్మ'

తెలుగు ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన కథా చిత్రాలను అందించిన దర్శకులలో నీలకంఠ ఒకరు. ఆయన పేరు వినగానే షో .. మిస్సమ్మ .. సదా మీ సేవలో .. నందనవనం 120 కి.మీ .. మిస్టర్ మేధావి .. విరోధి సినిమాలు గుర్తుకు వస్తాయి. వీటిలో 'మిస్సమ్మ'తో పాటు ఆయనకి 'షో' సినిమా కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

 రెండే పాత్రలతో 'షో' సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అనే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది .. ఆ బడ్జెట్ లో సినిమా చేయడాన్ని ఛాలెంజింగ్ గా భావించాను" అని చెప్పారు. " తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలంటే పాత్రలు .. కాస్ట్యూమ్స్ .. లొకేషన్స్ ను తగ్గించుకోవాలి. ఆ విషయంపైనే బాగా ఫోకస్ పెట్టాను. బడ్జెట్ కి తగిన కథను రెడీ చేసుకోవాలనుకున్నాను. రెండే పాత్రలతో చేస్తే సరిపోతుంది కదా అనే ఐడియా అప్పుడే వచ్చింది. ఆ ఆలోచనలో నుంచి పుట్టిన కథే 'షో' .." అని నీలకంఠ అన్నారు.  

More Telugu News