social media: సోష‌ల్‌మీడియాలో ఫొటోలు పెట్ట‌డం ఇస్లాంకు విరుద్ధం!: ముస్లిం సంస్థ ఫత్వా

  • ఫ‌త్వా జారీ చేసిన యూపీ ఇస్లాం సంస్థ‌
  • ఓ వ్య‌క్తి ప్ర‌శ్న‌కు బదులుగా ఫ‌త్వా రూపంలో స‌మాధానం
  • గ‌తంలో క‌నురెప్ప‌లు క‌త్తిరించుకోవ‌డంపై కూడా ఫ‌త్వా

దేశంలో ముస్లిం మ‌త సంస్థ‌ల్లో ఒక‌టైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని స‌హ‌ర‌న్‌పూర్‌కి చెందిన దారుల్ ఉలుమ్ దియోబంధ్ సంస్థ ఓ ఫ‌త్వా జారీ చేసింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్‌మీడియా మాధ్య‌మాల్లో ఫొటోలు షేర్ చేయ‌డం ఇస్లామిక్ సంప్ర‌దాయాల‌కు విరుద్ధ‌మ‌ని ఫ‌త్వా సారాంశం.

 కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం వ్య‌క్తి... వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో త‌న‌వి, త‌న భార్య‌వి ఫొటోలు పెట్ట‌డం ముస్లిం సంప్ర‌దాయాల‌కు విరుద్ధ‌మా? అని ప్ర‌శ్నిస్తూ ఓ లేఖ రాశాడు. ఈ లేఖ‌కు స్పంద‌న‌గా ఈ ఫ‌త్వా జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ముస్లిం మ‌హిళ‌లు జుట్టు క‌త్తిరించుకోవ‌డం, క‌నురెప్ప‌లు క‌త్తిరించుకోవ‌డాల‌ను నిషేధిస్తూ దారుల్ ఉలుమ్ దియోబంధ్ సంస్థ ఫ‌త్వా జారీ చేసింది.

More Telugu News