గోల్డ్ ధర: మూడు వారాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధర

  • దీపావళి పండుగ నేప‌థ్యంలో పెరిగిన ప‌సిడి ధ‌ర‌
  • రూ.290 పెరిగిన 10 గ్రాముల బంగారం ధ‌ర‌ 
  • 99.9 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.31 వేలు
  • 99.5 శాతం స్వచ్ఛత కలిగిన ప‌సిడి ధ‌ర రూ.30,850

దీపావళి పండుగ నేప‌థ్యంలో ప‌సిడి ధ‌ర‌ మూడు వారాల గరిష్టానికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధ‌ర‌ రూ.290 చొప్పున పెరిగి దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.31వేలకు చేరుకోగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన ప‌సిడి ధ‌ర రూ.30,850గా న‌మోదైంది. మ‌రోవైపు అంత‌ర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్స్‌కు 0.12 శాతం తగ్గి 1,283.20 డాలర్లగా న‌మోదైంది. వెండిధ‌ర‌లో ఎటువంటి మార్పు క‌న‌ప‌డ‌లేదు. కిలో వెండి ధ‌ర రూ.41వేలుగా న‌మోదైంది. దీపావ‌ళి సంద‌ర్భంగా డిమాండ్ పెర‌గ‌డంతో బంగారం ధ‌ర‌ పెరిగింది.    

More Telugu News