స్టార్ వార్స్ రోజులొచ్చేశాయి... రోడ్లపై సందడి చేయనున్న ఎగిరే బైక్ లు!
- స్టార్ వార్స్ సినిమాలో గాల్లో ఎగిరే బైకులు, కార్లు
- దుబాయ్ పోలీసులకు గాల్లో ఎగిరే బైకులు
- రెస్య్యూ ఆపరేషన్ లో వేగంగా పాలుపంచుకునే అవకాశం ఉందంటున్న పోలీసులు
ఈ బైక్ కు 'స్కార్పియో' అనే పేరు పెట్టారు. ఈ బైక్ కు అన్ని వైపులా కెమెరాలు ఉంటాయి. 25 నిమిషాల్లో 64 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ బైక్ 272 కేజీల బరువు ఉంటుంది. దీనిని రష్యాకు చెందిన 'హోవర్ బైక్స్' అనే సంస్థ తయారు చేసింది. నాలుగు వైపులా ప్రొఫెల్లర్ లతో పాటు నాలుగు బ్లేడ్ లను అమర్చారు. సింగిల్ డ్రైవర్ ప్రయాణించే ఈ బైక్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ సమయంలో సహాయమందించేందుకు ఈ బైక్ లు ఎంతో ఉపయోగపడతాయని దుబాయ్ పోలీసులు పేర్కొంటున్నారు.