anil kumble: కుంబ్లేను ఘోరంగా అవమానించిన బీసీసీఐ!

  • తాజాగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న కుంబ్లే
  • రంజీ ఆటగాడికి చెప్పినట్టు విషెస్ చెప్పిన బీసీసీఐ
  • బీసీసీఐ తీరును దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లేను బీసీసీఐ ఘోరంగా అవమానించింది. సహచరులంతా ముద్దుగా జంబోగా పిలుచుకునే అనిల్ కుంబ్లే పుట్టిన రోజు తాజాగా జరిగింది. ఈ సందర్భంగా సహచరుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సహచరుల్లాగే ఆయనకు బీసీసీఐ కూడా శుభాకాంక్షలు చెప్పింది. అయితే అందరు సహచరులు ఆయనను దిగ్గజంగా పేర్కొనగా, టీమిండియాలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అనిల్ కుంబ్లేకు రంజీ ఆటగాడికి చెప్పినట్టు బీసీసీఐ విషెస్ చెప్పింది.

 దీంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా దిగ్గజ ఆటగాడిగా, భారత క్రికెట్ జట్టు మాజీ సలహాదారుగా, సాంకేతిక నిపుణుడిగా, కోచ్ గా సేవలందించిన దిగ్గజానికి శుభాకాంక్షలు చెప్పేది ఇలాగేనా? అంటూ పలువురు నెటిజన్లు బీసీసీఐని నిలదీశారు. తీవ్ర విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన బీసీసీఐ లెజెండ్ అనిల్ కుంబ్లేకి పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ మళ్లీ ట్వీట్ చేసింది. 
anil kumble
bcci
tweet

More Telugu News