ప్రయాణికుల ప్రాణాలు గాల్లో వదిలేసి.. హాయిగా దమ్ముకొడుతూ బస్సును నడిపిన డ్రైవర్.. వీడియో ఇదిగో!
- తన పనిపట్ల నిర్లక్ష్యం వహించిన డ్రైవర్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా కావడంతో పోలీసు కేసు నమోదు
- ఓ చేతితో స్టీరింగ్ పట్టుకుని మరో చేతిలో పొగతాగిన డ్రైవర్
- పనిలోంచి తొలగించిన హర్యానా రోడ్ వేస్
చివరికి ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, చివరికి ఆ బస్సు డ్రైవర్‌ను గుర్తించారు. ఆ బస్సు నెంబరు HR 55W 9038 అని, ఆ వ్యక్తి పేరు ఓమ్ ప్రకాశ్ అని పోలీసులు చెప్పారు. ఆ డ్రైవర్ బస్సులో ఓ చేతిలో హుక్కా పట్టుకుని డ్రైవింగ్‌లో ఉండగా ధూమపానం చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడని తెలిపారు.
ఆ బస్సు డ్రైవర్ ఈ చర్యకు పాల్పడుతుండగా ఆ బస్సు పక్కనుంచి వెళుతోన్న ఓ కారులోంచి ఓ యువకుడు ఈ వీడియో తీశాడని చెప్పారు. ఆ డ్రైవర్ ను హర్యానా రోడ్ వేస్ పనిలో నుంచి తొలగించింది. ఈ వీడియోను మీరూ చూడండి...