దేశం పేరును కూడా మార్చేస్తారు!: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్
- బీజేపీ నియంతృత్వ పోకడలను అనుసరిస్తోంది
- ప్రజాస్వామ్య విధానాలను పాటించడం లేదు
- దేశం పేరును కూడా మార్చేస్తారు
బీజేపీ ప్రజాస్వామ్య విధానాలను అవలంబించడం లేదని... నియంతృత్వ పోకడలను అనుసరిస్తోందని దీదీ మండిపడ్డారు. మన దేశంలో వివిధ మతాలు, వర్గాలు, జాతులు, కులాలకు చెందిన ప్రజలు ఉన్నారని... బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టిన బీజేపీ నేతలు... విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.