sai prajwala: తిరుపతిలో హోటల్ ముందు సాయి ప్రజ్వల... గుర్తించి పట్టించిన స్థానికులు!

షార్ట్స్‌లో చూడండి
నారాయణ కాలేజీలో చదువుకోవాలని ఒత్తిడి పెడుతున్నారని, అక్కడ నరకం కనిపిస్తోందని లేఖ రాసి పెట్టి, ఇంట్లోంచి వెళ్లిపోయిన హైదరాబాద్ అమ్మాయి సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె తిరుగుతుండగా, అప్పటికే టీవీలో చూసిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆ వెంటనే అమ్మాయిని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు, అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రజ్వల తండ్రి హుటాహుటిన తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఈ విషయంలో మధ్యాహ్నం తర్వాత తిరుపతి పోలీసులు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారని సమాచారం.
Go Back to Shorts
sai prajwala
narayana
student
tirupati

More Telugu News