sachin tendulkar: ఆ ఫేక్ అకౌంట్లు వెంటనే తొలగించాలి!: సచిన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్

  • నా కుమారుడు, కుమార్తెల పేరుతో ఫేక్ అకౌంట్లు
  • వీరికి ట్విట్టర్ అకౌంట్లే లేవు
  • ఈ ఫేక్ అకౌంట్లను వెంటనే తొలగించాలి

తన కుమారుడు అర్జున్, కుమార్తె సారాల పేరుతో ట్విట్టర్ లో క్రియేట్ అయిన ఖాతాలపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆందోళనకు గురయ్యారు. సంబంధం లేని వ్యక్తులు ఈ ఖాతాలను సృష్టించారని... ఈ ఖాతాల నుంచి లేనిపోని విషయాలను పోస్ట్ చేస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఖాతాలన్నీ ఫేక్ అని... సారా, అర్జున్ లకు ట్విట్టర్ ఖాతాలు లేవని చెప్పారు. ఈ ఫేక్ అకౌంట్లను తక్షణమే తొలగించాలని ట్విట్టర్ ను కోరారు. ఇలాంటి పోస్టుల నుంచి ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని అన్నారు.

More Telugu News