పవన్ నటనంటే నాకు చాలా ఇష్టం : భానుప్రియ

16-10-2017 Mon 17:42
  • పవన్ సినిమాల గురించి స్పందించిన భానుప్రియ 
  • ఆయన సినిమాలు తప్పకుండా చూస్తాను 
  • 'అత్తారింటికి దారేది' బాగా నచ్చింది 
  • అవకాశం వస్తే ఆయన సినిమాలో చేస్తా    
చిరంజీవితో కలిసి భానుప్రియ చాలా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు సక్సెస్ లను అందుకున్నాయి. అలాంటి భానుప్రియకి పవన్ సినిమాలను గురించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా పవన్ గొప్ప నటుడంటూ ఆమె ప్రశంసించారు.

పవన్ నటన .. ఆయన ఎమోషన్స్ ను పండించే తీరు .. డైలాగ్స్ చెప్పే విధానం చాలా బాగుంటాయని చెప్పారు. ఆయన సినిమాలను తాను తప్పకుండా చూస్తుంటాననీ .. వాటిలో తనకి 'అత్తారింటికి దారేది' చాలా ఇష్టమని అన్నారు. ఆ సినిమాలో ఆయన నటన తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. అవకాశం వస్తే ఆయన సినిమాలో చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అన్నారు.