ram gopal varma: నా సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ అలాగే ఉంటుంది : వర్మ

  • సక్సెస్ ను ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు 
  • నా దృష్టిలో సక్సెస్ అంటే ఇదే 
  • ఆ విధంగా చూస్తే నేను సూపర్ సక్సెస్ ఫుల్

తెలుగు .. హిందీ భాషల్లో రామ్ గోపాల్ వర్మకి దర్శకుడిగా ప్రత్యేకమైన స్థానం వుంది. ఆయన ధోరణి కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తే .. మరికొంతమందికి ఆసక్తిని కలగజేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ..  పాతికేళ్ల కెరియర్లో వ్యక్తిత్వం పరంగా .. ప్రజల నుంచి వస్తోన్న రెస్పాన్స్ పరంగా పెరిగానని అనుకుంటున్నారా? లేదంటే తగ్గాననుకుంటున్నారా? అనే ప్రశ్న 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో వర్మకి ఎదురైంది.

 సక్సెస్ అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుందని వర్మ చెప్పారు. సక్సెస్ విషయంలో అవతలవారు చూసే కోణం .. తాను చూసే కోణం ఒకేలా ఉండకపోవచ్చని అన్నారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకూ ఆ రోజు ఏమేం చేయాలని ఫీలవుతామో .. అవి చేయగలిగితే సక్సెస్ అని చెప్పారు. అభిరుచికి తగిన విషయాల్లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయడమే సక్సెస్ అనుకుంటే, తన 6వ యేట నుంచి ఇప్పటివరకూ తాను సూపర్ సక్సెస్ ఫుల్ అని స్పష్టం చేశారు. ఇక పెరిగానా .. తగ్గానా అనే మాటకి ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే, తాను ఎప్పుడూ అలాగే వుంటాను అని తేల్చి చెప్పారు.   

More Telugu News