trump: ట్రంప్ కు మరణమే కానుక: ఉత్తర కొరియా

  • పిచ్చి పట్టిన ముసలోడు ట్రంప్
  • తలకిందులుగా వేలాడదీసిన ఫొటో విడుదల
  • మరిన్ని ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాము మరణాన్ని కానుకగా ఇవ్వనున్నామని చెబుతూ ఉత్తర కొరియా ఓ ఫొటోను విడుదల చేసింది. ట్రంప్ ను తల్లకిందులుగా వేలాడదీయగా, ఆయన నోటి నుంచి రక్తం కారుతున్నట్టు ఫోటో ఉంది. "పిచ్చి పట్టిన స్థితిలో ఉన్న ముసలోడు ట్రంప్ కు మరణాన్ని అందించాల్సి వుంది" అన్న క్యాప్షన్ ఈ ఫొటోపై ఉంది. ఈ ఫొటో ఇప్పుడు ఉత్తర కొరియా మీడియాలో చక్కర్లుకొడుతోంది.

దేశ రాజధాని పాంగ్ యాంగ్ కు అణు సామర్థ్యమున్న క్షిపణులను తరలిస్తున్నట్టు నిన్న ఉత్తర కొరియా ప్రభుత్వం కొన్ని ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాము మరిన్ని పరీక్షలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నార్త్ కొరియా స్పష్టం చేసింది. గత నెలలో యూఎస్ బాంబర్లను పేల్చివేస్తున్నట్టు, ఆ తరువాత అమెరికా నగరాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు గ్రాఫిక్స్ చేసిన వీడియోలను ఉత్తర కొరియా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News