weapons: ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో 4 వేల ఏళ్లనాటి ఆయుధాలు లభ్యం!

  • 8800 అడుగుల ఎత్తులోని గుహలో లభ్యం
  • గుహ తవ్వకానికి ఐదేళ్లు పట్టిన వైనం
  • మరిన్ని పరిశోధనలు అవసరమంటున్న శాస్త్రవేత్తలు

స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో నాలుగువేల ఏళ్ల నాటి ఆయుధాలు బయటపడ్డాయి. వీటిని కాంస్య యుగం నాటివిగా గుర్తించారు. అప్పట్లో ఓ పర్వతారోహకుడు వీటిని ఉపయోగించి ఉండొచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విల్లు, బాణాలు, ఆహారం భద్రపరుచుకునే చెక్కపెట్టె వీటిలో ఉన్నాయి. పర్వత శ్రేణుల్లో 8800 అడుగుల ఎత్తులోని గుహలో శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు.

2011లో ఈ గుహను కనుగొనగా 2012లో తవ్వకాలు ప్రారంభించారు. దీనిని పూర్తిగా తవ్వి అందులోని వస్తువులను వెలికితీసేందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. క్రీస్తు పూర్వం 1800 నుంచి 2000 ఏళ్ల మధ్య ఈ వస్తువులను ఉపయోగించినట్టు అంచనా వేశారు. ఈ వస్తువులు వేటగాడు లేదంటే జీవాలకు కాపలా కాసే వ్యక్తికి చెందినవి అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు అవసరమని పేర్కొన్నారు.

More Telugu News