deo deo: డియ్యో డియ్యో... అంటున్న స‌న్నీ లియోన్‌.... వీడియో చూడండి

  • `పీఎస్‌వీ గ‌రుడ వేగ 126.18ఎం` పాట విడుద‌ల‌
  • రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌స్తున్న సినిమా
  • ద‌ర్శ‌క‌త్వం ప్ర‌వీణ్ స‌త్తారు

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ `పీఎస్‌వీ గరుడ వేగ 126.18ఎం` తెలుగు సినిమాలో ఓ ఐట‌మ్ సాంగ్‌లో న‌ర్తించింది. `డియ్యో డియ్యో` అంటూ సాగే ఈ పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. భీమ్స్ సిసిరోలియో స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ పాట‌ను గీతామాధురి, ర‌ఘు రామ్ ఆల‌పించారు. ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా నటించిన సంగ‌తి తెలిసిందే. జాతీయ అవార్డు గ్ర‌హీత ప్ర‌వీణ్ స‌త్తారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గతంలో మంచు మ‌నోజ్ `క‌రెంట్ తీగ‌` సినిమాతో స‌న్నీ లియోన్ తెలుగు తెరపై మొద‌టిసారి క‌నిపించింది.

More Telugu News