ilaiah: అసలు సమస్య అక్కడే వస్తోంది: తన పుస్తకంపై క‌ంచ ఐల‌య్య‌

  • నా పుస్త‌కంలో బేసిక్ ఇష్యూ దేవుళ్ల‌కి సంబంధించింది కాదు
  • పీఠాధిపతులు, రచయితలే ఎందుకు మాట్లాడుతున్నారు?
  • ప్రొఫెసర్లు, పరిశోధన చేసే విద్యార్థులు ఎందుకు మాట్లాడడం లేదు?
  • సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణ‌యాన్ని కూడా త‌ప్ప‌ని వ్యాఖ్యానిస్తున్నారు

తాను రాసిన పుస్త‌కంలో బేసిక్ ఇష్యూ దేవుళ్ల‌కి సంబంధించింది కాదని, ఇది హిందూ మతం గురించి వివ‌రించిన‌ పుస్తకం కానే కాదని ప్రొ.కంచ ఐల‌య్య అన్నారు. ఆయన రాసిన 'సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు' పుస్త‌కంపై నిషేధం విధించలేమంటూ సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై మీడియాతో మాట్లాడిన ఐల‌య్య... అస‌లు స‌మ‌స్య ఎక్క‌డ వ‌స్తోందంటే, సినిమా ర‌చ‌యిత‌లు, జొన్న‌విత్తుల వంటి సినిమా పాట‌లు రాసుకునేవారు, పీఠాధిప‌తులు మాత్ర‌మే త‌న‌ పుస్త‌కంపై అభ్యంత‌రక‌ర‌ వ్యాఖ్య‌లు చేస్తూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

మ‌రి ఈ దేశంలోని ఇన్ని యూనివ‌ర్సిటీల్లోని ప్రొఫెస‌ర్లు, ప‌రిశోధ‌న చేసే విద్యార్థులు ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని ఐలయ్య నిల‌దీశారు. సినిమా పాట‌లు రాసుకునే వారు, త‌న‌ పుస్తకాన్ని వ్య‌తిరేకించే వారు ఇప్పుడు దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానమైన సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణ‌యాన్ని కూడా త‌ప్ప‌ని వ్యాఖ్యానిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇటువంటి వారితో తాను చర్చ‌లో పాల్గొనాలా? అని ఎద్దేవా చేశారు. 

More Telugu News