roja: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో నటించడంపై రోజా స్పందన

  • వర్మ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు
  • లక్ష్మీపార్వతి పాత్రను పోషిస్తున్నానంటూ ప్రేక్షకులు అనుకోవడంలో తప్పు లేదు
  • అవకాశం వస్తే ఆలోచిస్తా

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే రోజా నటించబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రోజా స్పందించారు. లక్ష్మీపార్వతి పాత్రలో తాను నటిస్తున్నానని ప్రజలు అనుకోవడంలో తప్పు లేదని ఆమె అన్నారు. 150 సినిమాల్లో నటించిన తనను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని... ఆ అభిమానంతోనే వారు ఇలా ఊహించుకుంటుండవచ్చని తెలిపారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇంతవరకు తనను సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. అయితే, ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి జీవిత కథతో వస్తున్న సినిమాలో నటించే అవకాశం వస్తే,  తప్పకుండా ఆలోచిస్తానని తెలిపారు.

More Telugu News