milind soman: 18 ఏళ్ల అమ్మాయితో ప్రేమ‌లో పడిన 51 ఏళ్ల న‌టుడు మిలింద్ సోమ‌న్‌!

  • గ‌ర్ల్‌ఫ్రెండ్ అంకిత కొన్వార్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేసిన మోడ‌ల్‌
  • కూతురా? ప్రేయ‌సా? అని ప్ర‌శ్నించిన నెటిజ‌న్లు
  • ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేస్తున్న అంకిత‌

1995లో అలీశా చినై `మేడ్ ఇన్ ఇండియా` మ్యూజిక్ ఆల్బంలో క‌నిపించిన సూప‌ర్ మోడ‌ల్ మిలింద్ సోమ‌న్ గుర్తున్నాడు క‌దా! అప్ప‌టి నుంచి ఆయ‌న మోడ‌ల్‌గా, న‌టుడిగా రాణిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అత‌ని వ‌య‌సు 51 ఏళ్లు. ఆయ‌న ఇటీవ‌ల త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ అంకిత కొన్వార్‌తో క‌లిసి అమెజాన్ ఇండియా ఫ్యాష‌న్ వీక్‌కి హాజ‌ర‌య్యాడు.

అక్క‌డ అంకితతో క‌లిసి దిగిన ఓ సెల్ఫీని మిలింద్ త‌న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఆ ఫొటో చూసి నెటిజ‌న్లు మండిప‌డ్డారు. అందుకు కార‌ణం ఏంటంటే...అంకిత వ‌య‌సు 18 ఏళ్లు మాత్ర‌మే. ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేస్తున్న అంకిత, మిలింద్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వైర‌ల్‌గా మారిన వీరి ఫొటో మీద నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్ చేస్తున్నారు. `ఆమె నీ కూతురా? ప్రేయ‌సా?` అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. అయితే ఎక్కువ మంది నెటిజ‌న్లు `క్యూట్ క‌పుల్‌`, `జంట బాగుంది` అని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News