irffan khan: ఎట్ట‌కేల‌కు న్యాయం జ‌రిగింది... త‌ల్వార్ దంప‌తుల తీర్పుపై న‌టుడు ఇర్ఫాన్ ఖాన్‌

  • ఆరుషి హ‌త్య కేసు ఆధారంగా తీసిన సినిమాలో న‌టించిన ఇర్ఫాన్‌
  • `త‌ల్వార్‌` చిత్రంలో విచార‌ణ అధికారి అశ్విన్ కుమార్ పాత్ర పోషించిన ఇర్ఫాన్‌
  • హ‌ర్షం వ్య‌క్తం చేసిన చిత్ర‌ద‌ర్శ‌కురాలు, నిర్మాత

ఆరుషి, హేమ‌రాజ్ జంట హ‌త్య‌ల కేసులో ఆరుషి త‌ల్లిదండ్రులు నూపుర్‌, రాజేశ్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా ప‌రిగ‌ణిస్తూ అల‌హాబాద్ హైకోర్టు తీర్పునివ్వడంపై బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందించారు. ఎట్ట‌కేల‌కు ఆరుషి త‌ల్లిదండ్రుల‌కు న్యాయం జ‌రిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆరుషి హ‌త్య‌కేసు ఆధారంగా తీసిన `త‌ల్వార్‌` చిత్రంలో విచార‌ణాధికారి అశ్విన్ కుమార్ పాత్ర‌ను ఇర్ఫాన్ ఖాన్ పోషించారు.

గురువారం రోజు తీర్పు గురించి తెలియ‌గానే త‌న‌కు చాలా ఆనందం వేసింద‌ని 'త‌ల్వార్' చిత్ర ద‌ర్శ‌కురాలు మేఘ‌నా గుల్జార్ తెలిపారు. అలాగే చిత్ర నిర్మాత విశాల్ భ‌రద్వాజ్ కూడా కోర్టు తీర్పు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌మ సినిమాలో ఎవ‌రి ప‌క్షం వ‌హించకుండా త‌ట‌స్థ ధోర‌ణితో చూపించిన‌ప్ప‌టికీ త‌మ‌ని ఎంతో మంది ప్ర‌శ్నించార‌ని భ‌ర‌ద్వాజ్ తెలిపారు. త‌ల్వార్ దంప‌తుల‌కు న్యాయం జ‌రిగినందుకు చాలా ఆనందంగానే వుందని, అయితే, ఇంత‌కాలం జైలు జీవితంతో తమ విలువైన స‌మ‌యాన్ని వారు కోల్పోయిన సంగ‌తి గురించి ఆలోచిస్తే మాత్రం త‌న‌కు బాధ క‌లుగుతుంద‌ని భ‌ర‌ద్వాజ్ పేర్కొన్నారు.

More Telugu News