sudheer babu: హీరోగానే కాదు .. నిర్మాతగానూ సుధీర్ బాబు!

  • 'భలేమంచి రోజు'తో సుధీర్ బాబుకి హిట్ 
  • మంచి కథ కోసం కొంతకాలంగా వెయిటింగ్ 
  • కొత్త దర్శకుడితో రీసెంట్ గా సెట్స్ పైకి 
  • కన్నడ భామ 'నాభా నతేష్' కథానాయిక  

యాక్షన్ .. రొమాంటిక్ హీరోకి కావలసిన అన్ని లక్షణాలు మనకి సుధీర్ బాబులో కనిపిస్తాయి. 'భలేమంచి రోజు' తరువాత ఆయన ఆ స్థాయి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నూతన దర్శకుడు రాజశేఖర్ నాయుడు వినిపించిన కథ నచ్చడంతో, తాజాగా ఆయన ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాల వలన నిర్మాత చివరి నిమిషంలో పక్కకి తప్పుకున్నాడు.

దాంతో ప్రాజెక్టు ఆదిలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కంటెంట్ పై గల నమ్మకంతో, తానే ఈ సినిమాను నిర్మించాలని సుధీర్ బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. రవిబాబు దర్శకత్వం వహించిన 'అదుగో' సినిమాలో కథానాయికగా చేసిన 'నాభా నతేష్' ను .. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.  

More Telugu News