కల్నల్ భార్యతో అక్రమసంబంధం... బ్రిగేడియర్ సీనియారిటీని పదేళ్లు కోసేసిన జనరల్ కోర్టు మార్షల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కల్నల్ భార్యతో అక్రమసంబంధం... బ్రిగేడియర్ సీనియారిటీని పదేళ్లు కోసేసిన జనరల్ కోర్టు మార్షల్

  • అక్రమ సంబంధం ఆర్మీలో చాలా పెద్ద నేరం
  • కోర్టులో నేరం ఒప్పుకున్న బ్రిగేడియర్
  • పదేళ్ల సీనియారిటీ తగ్గిస్తూ తీర్పు
తనకన్నా పై అధికారి జీవిత భాగస్వామితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ బ్రిగేడియర్, సైనిక కోర్టులో తప్పును ఒప్పుకోవడంతో అతని సీనియారిటీని పదేళ్లు తగ్గిస్తూ, కఠిన శిక్షను విధించారు న్యాయమూర్తులు. పశ్చిమ బెంగాల్ లోని సుక్మా ప్రాంతంలో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కీలకమైన సైనిక విభాగంలో బ్రిగేడియర్ గా ఉన్న ఉద్యోగికి (పేరును సైన్యం వెల్లడించలేదు) త్వరలోనే మేజర్ జనరల్ గా ర్యాంకు రానుంది. అయితే, అతను తనకన్నా పై అధికారి అయిన కల్నల్ భార్యకు దగ్గరయ్యాడు.

ఆర్మీలో ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చాలా పెద్ద నేరం. ఇలా చేసి దొరికిపోతే, వారిని విధుల నుంచి తొలగించడం, పెన్షన్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పంపడం వంటివి చేస్తారు. ఇక, ఈ బ్రిగేడియర్ తన తప్పును ఒప్పుకోవడంతోనే స్వల్ప శిక్షతో సరిపెట్టినట్టు ఓ అధికారి తెలిపారు. ఇతనిపై మొత్తం 13 అభియోగాలు నమోదయ్యాయి. అన్నింటినీ అంగీకరించాడు. పదేళ్ల సీనియారిటీ పోవడంతో, ఇతనికన్నా ఎన్నో ఏళ్ల చిన్నవారికి ముందుగానే ప్రమోషన్లు రానున్నాయి.
brigadier
colnol
sukma
wife

More Telugu News