Facebook: ప్రపంచవ్యాప్తంగా కాసేపు ఆగిపోయిన ఫేస్‌బుక్.. కోట్లాది మందిలో టెన్షన్!

  • అమెరికా, యూరప్ సహా భారత్‌లోనూ ఆగిన సేవలు
  • ఇబ్బంది పడిన ఖాతాదారులు
  • గంటలోపే సమస్యను పరిష్కరించిన ఫేస్‌బుక్ నిపుణులు

ఫేస్‌బుక్ లేకుండా క్షణం కూడా ఉండలేని వినియోగదారులు బుధవారం రాత్రి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అమెరికా, మెక్సికో, మలేషియా, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతోపాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా ఇబ్బందులు పడ్డారు.

ఆయా ఖాతాలు ఓపెన్ చేసిన వారికి ‘అంతరాయానికి చింతిస్తున్నాం’ అన్న మెసేజ్ కనిపించింది. దీంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. సేవలు నిలిచిపోవడంతో రంగంలోకి దిగిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నిపుణులు గంటలోనే సమస్యను పరిష్కరించారు. సమస్య పరిష్కారం కావడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News