bombers: కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధ విమానాల చక్కర్లు.. ఏం జరగబోతోంది?

  • జపాన్, దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు
  • కిమ్ దూకుడుకు అడ్డుకట్ట వేసే వ్యూహం
  • రక్షణశాఖ అధికారులతో ట్రంప్ సమావేశం

అమెరికా-ఉత్తర కొరియాల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా ఉన్న నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానాలు కొరియా ద్వీపకల్పంపై చక్కర్లు కొట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధ నైపుణ్యాలను పెంచుకునే క్రమంలో దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అమెరికా ఈ వైమానిక విన్యాసాలను నిర్వహించింది. విన్యాసాలకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్షణ శాఖ ఉన్నతాధికారులు, సలహాదారులతో సమావేశమయ్యారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే ధోరణిపై చర్చించారు. ఉత్తర కొరియా దుందుడుకుగా వ్యవహరిస్తే ఎలా స్పందించాలన్న దానిపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. అణ్వస్త్రాలను బూచిగా చూపి భయపెడుతున్న ఉత్తర కొరియాను ఎలా నిలువరించాలన్న దానిపై చర్చించినట్టు సమాచారం.

ఫిబ్రవరి నుంచి  అమెరికా-ఉత్తర కొరియాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తరకొరియా వరుసపెట్టి అణ్వాయుధ పరీక్షలు చేస్తూ అమెరికాకు సవాళ్లు విసురుతోంది. ఒకనొక దశలో అమెరికాపై త్వరలో బాంబుల వర్షం కురిపిస్తామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో యుద్ధం తప్పదన్న సంకేతాలు కూడా వెలువడ్డాయి. ట్రంప్ కూడా దీటైన ప్రకటనలు చేస్తూ నార్త్ కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్‌కు హెచ్చరికలు పంపుతున్నారు.

More Telugu News