amy jackson: `రోబో 2.0`లో ఎమీ జాక్స‌న్ ఫ‌స్ట్‌లుక్ ఇదే!

  • లేడీ రోబోగా క‌నిపించ‌నున్న ఎమీ
  • ట్వీట్ చేసిన న‌టి
  • ఫిదా అవుతున్న అభిమానులు

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న `రోబో 2.0` చిత్రంలో త‌న లుక్‌ను న‌టి ఎమీ జాక్స‌న్ అభిమానుల‌తో పంచుకుంది. `సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి దీన్ని (ఫ‌స్ట్‌లుక్‌) మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను` అంటూ ఎమీ జాక్స‌న్ ట్వీట్ చేసింది.

లేడీ రోబో వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఎమీ చాలా స్టయిలిష్ గా క‌నిపిస్తోంది. ఈ లుక్‌ను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన 3డీ ప‌నుల వీడియోను కూడా చిత్ర‌యూనిట్ షేర్ చేసింది. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

More Telugu News