Shraddha: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • ఇంట్లో వున్నట్టుగానే ఉందంటున్న శ్రద్ధాకపూర్ 
  • నెల్లూరులో 'ఆక్సిజన్' ఆడియో వేడుక 
  • భారీ ఎత్తున విజయ్ చిత్రం రిలీజ్ 
  • తెలుగులో 'హిందీ మీడియం' రీమేక్  

*  సాహో సినిమా షూటింగ్ చాలా హ్యాపీగా.. ఉల్లాసభరిత వాతావరణంలో సాగుతోందని అంటోంది నాయిక శ్రద్ధాకపూర్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధ నటిస్తోంది. ఇటీవల హైదరాబాదులో జరిగిన షూటింగ్ గురించి ఈ చిన్నది చెబుతూ, 'హైదరాబాదులో వుంటే అచ్చం ఇంట్లో వున్నట్టుగానే వుంది. ఇక సాహో యూనిట్ అయితే చెప్పేక్కర్లేదు. చాలా సరదాగా వుంది.. షూటింగ్ ఉత్సాహంగా జరిగింది' అని చెప్పింది.      
*  యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన 'ఆక్సిజన్' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 15న నెల్లూరులోని కస్తూరి దేవి గార్డెన్స్ లో  నిర్వహిస్తారు. ఈ నెల 27న చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఎం.జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటించారు.
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున 3292 స్క్రీన్స్ మీద విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని 'అదిరింది' పేరిట డబ్ చేస్తున్నారు.
*  12 కోట్లతో నిర్మితమైన బాలీవుడ్ చిత్రం 'హిందీ మీడియం' మంచి విజయాన్ని సాధించి, వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనిని దర్శకురాలు నందిని రెడ్డి తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కథానాయకుడుగా నటించే అవకాశం వుంది.   

More Telugu News