ఓలా, ఉబెర్ లకు మేలు చేసేందుకే మెట్రో రైలు ఛార్జీలు పెంచారు: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి
- ఢిల్లీ మెట్రోను ప్రీమియమ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ గా మార్చాలనుకుంటున్నారు
- ఛార్జీలు పెరిగితే జనాలు క్యాబ్స్ చూసుకుంటారు
- వాతావరణ కాలుష్యం ఎక్కువవుతుంది
ప్రైవేట్ క్యాబ్ లు, ట్యాక్సీల కన్నా మెట్రో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని... దీంతో, క్యాబ్స్ కు మేలు జరుగుతుందని చెప్పారు. ఢిల్లీ మెట్రోను 'ప్రీమియమ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్'గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... దీన్ని ఆప్ ప్రభుత్వం అంగీకరించదని అన్నారు. మెట్రో ఛార్జీలు పెరిగితే... ప్రజలంతా క్యాబ్ ల వైపు మొగ్గుచూపుతారని... దీంతో నగరంలో వాతావరణ కలుషితం మరింత పెరుగుతుందని చెప్పారు.