nara rohith: పరుచూరి మురళి దర్శకత్వంలో నారా రోహిత్ .. రేపే ముహూర్తం!

  • విడుదలకు ముస్తాబవుతోన్న 'బాలకృష్ణుడు'
  • నారా రోహిత్ చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు
  • పరుచూరి మురళితో ఓ సినిమా
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు

నారా రోహిత్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బాలకృష్ణుడు' రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరికొన్ని ప్రాజెక్టులను నారా రోహిత్ లైన్లో పెట్టాడు. వాటిలో పరుచూరి మురళి దర్శకత్వం వహించే సినిమా ఒకటి.

గతంలో పరుచూరి మురళి 'నీ స్నేహం' .. 'ఆంధ్రుడు' .. 'అధినాయకుడు' సినిమాలను తెరకెక్కించాడు. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, తదుపరి సినిమాను నారా రోహిత్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ రేపే ప్రారంభం కానుంది. 

More Telugu News