స్మగ్లింగ్ రూటే సెపరేటు... విమానంలోని 29 మంది ప్రయాణికుల కడుపులో 30 కేజీల బంగారం!
- దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో స్మగ్లర్లు
- 29 మంది పొట్టలో బంగారం ఉన్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు
- 30 కేజీల బంగారాన్ని కక్కించిన అధికారులు
దుబాయ్ నుంచి మధురై విమానాశ్రయానికి వచ్చిన విమానంలో 29 మంది ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని స్కానింగ్ చేయగా, వారందరి కడుపులో బంగారం ఉండడం విశేషం. పాలిథీన్ కవర్ లో బంగారాన్ని పెట్టి వీరు మింగేశారు. వారిని ఆసుపత్రికి తరలించి, వారి నుంచి 30 కేజీల బంగారాన్ని కక్కించారు. అనంతరం వారందర్నీ అరెస్టు చేసి, విచారణ ప్రారంభించారు.