కోర్టు చివాట్లు పెట్టినా చంద్రబాబు తుడుచుకుని పోతున్నారు: రఘువీరా
- ప్రజలను అన్ని విషయాల్లో మోసం చేస్తున్నారు
- విభజన చట్టంలోని హామీలను తెప్పించడంలో విఫలమయ్యారు
- సదావర్తి భూముల విషయంలో చర్చ జరగాలి
విభజన చట్టంలోని హామీలను అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని తెలిపారు. సదావర్తి భూముల విషయంలో కోర్టులను కూడా టీడీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కోర్టు చీవాట్లు పెట్టినా... చంద్రబాబు తుడుచుకుని పోతున్నారని అన్నారు. సదావర్తి భూముల విషయంలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.